మహారాష్ట్రలో కొత్తగా 10,216 కరోనా కేసులు
ముంబయి: మహారాష్ట్రలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 10,216 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,98,399కు చేరింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా రాష్ట్రంలో 53 మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో మరణాల సంఖ్య 52,393కు చేరింది. మరోవైపు గత 24 గంటల్లో 6,467 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 20,55,951కు చేరినట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుతం రాష్ట్రంలో 88,838 యాక్టివ్ కేసులు ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు.