కడప ఎంపి అవినాష్ రెడ్డికి కరోనా!

కడప : కరోనా మహమ్మారి సామాన్యుల మొదలు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అందరిని పీడిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డికి కరోనా సోకింది. సెప్టెంబర్ మొదటి వారంలో సిఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు, ఎమ్మెల్యేలు, మీడియా సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. కాగా గత వారం పదిరోజులలో ఎంపిని కలిసిన వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.