చిన్నారికి మంత్రి పువ్వాడ చేయూత

◆ మానవత్వం చాటుకున్న మంత్రి ◆ ఆపరేషన్ ఖర్చుల కోసం రూ.50వేలు ఇచ్చిన‌ మంత్రి

ఖమ్మం: మ‌ంత్రి పువ్వాడ గొప్ప‌మ‌నుసును చాటుకున్నాడు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఓ చిన్నారికి చేయూత నిచ్చారు. నగరం 18వ డివిజన్ మెదర బజార్ కు చెందిన 10ఏళ్ల చిన్నారి మరసకట్ల అరణ్య శ్రీ బ్రెయిన్ లో గడ్డ తో తీవ్ర ఇబ్బంది పడుతుంది. తక్షణమే అపరేషన్ చేసి గడ్డ ను తొలగించాలని చెన్నై ఆసుపత్రి వైద్యులు సూచించారు. దిక్కుతోచని స్థితిలో శనివారం తెరాస జిల్లా పార్టీ కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారిని కలిసి తన గోడు విన్నవించారు. చలించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అరణ్యశ్రీ వివరాలు అడిగి తెలుసుకుని చిన్నారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆదివారం తన నివాసంలో చిన్నారి అరణ్య శ్రీ తల్లిదండ్రులు వీరా కుమార్, శైలజ లకు రూ.50,000 నగదును అందజేశారు. వీరా కుమార్ నగరంలో పెయింటింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మంత్రి పువ్వాడ సహకారంతో వారి కళ్ళలో ఆనందం వెల్లువిరిసింది. అడిగిన వెంటనే స్పందించినందుకు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.