తెలంగాణలో పసుపు బోర్డు ప్రతిపాదనేదీ లేదు: కేంద్రం
న్యూఢిల్లీ: నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ఆలోచనే లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. తెలంగాణలో పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదనేదీ లేదని పార్లమెంట్‌లో కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నెల 12న తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపి సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం ఉన్నందున పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.