ఎపిలో కొత్త‌గా 1,271 క‌రోనా కేసులు

అమ‌రావాతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల వ్య‌వ‌ధిలో 31,809 సాంపిల్స్ పరీక్షించగా 1,271 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు గురువారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో కరోనా కారణంగా ముగ్గురు వ్య‌క్తులు మరణించారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్పటి వరకు 7,220 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 464 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 9,03,260 కు చేరుకుంది. అలాగే కోలుకున్నవారి సంఖ్య 8,87,898 కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,142 యాక్టివ్‌ కేసులు ఉన్నాయ‌ని అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.