దారుణం: టెన్త్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం!

సర్దానా: ఉత్తరప్రదేశ్ లోని సర్దానా జిల్లాకు చెందిన ఓ టెన్త్ క్లాస్ విద్యార్థిని ట్యూషన్ నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా దారిలో నలుగురు యువకులు విద్యార్థిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు.
అంతటితో ఆగకుండా ఈ నలుగురు మృగాళ్లు విషయం ఎక్కడ బయటపడుతుందో అని విషం కలిపిన ఆహరం బలవంతంగా విద్యర్థినికి తినిపించారు. దీంతో ఆ విద్యార్థిని అపస్మారక స్థితికి వెళ్ళింది. ఎలాగోలా ఇంటికి చేరుకున్న విద్యార్థిని చూసిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.