తెలంగాణలో కొత్తగా 1321 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1321 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆదివారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,140కి చేరింది. ఇందులో 3,02,500 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,923 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో ఐదుగురు కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1717కి చేరింది. కరోనా బులెటిన్ ప్రకారం నిన్నటి రోజున 293 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని అధికారులు వెల్లడించారు.