మహారాష్ట్రలో రాత్రి క‌ర్ఫ్యూ.. ఆ రోజుల్లో లాక్ డౌన్!

ముంబ‌యి: మ‌హారాష్ట్రలో కొవిడ్ మ‌హ‌మ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వైర‌స్ క‌ట్ట‌డిలో భాగంగా రాష్ట్రం మొత్తం రాత్రి క‌ర్ఫ్యూ అమ‌లు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. రాత్రి 8 గంట‌ల నుండి ఉద‌యం 7 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు అమలులో ఉంటాయ‌ని వెల్ల‌డించింది. రాష్ట్రంలో క‌రోనా ఉధృతిపై స‌మావేశ‌మైన కేబినెట్ మ‌హారాష్ట్రలో రాత్రి క‌ర్ఫ్యూ అములు చేసేందుకు ఆమోద ముద్ర వేసింది. తాజా ఆంక్ష‌లు సోమ‌వారం నుంచి అములోనికి వ‌స్తాయ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇక వ‌చ్చే శుక్ర‌వారం రాత్రి నుంచి సోమ‌వారం ఉద‌యం వ‌ర‌కు (3 రోజులు) పూర్తి లాక్‌డౌన్ ఆంక్ష‌లు అమ‌లు చేయ‌నున్న‌ట్లు నిర్ణ‌యించింది.

గత కొన్ని వారాలుగా రాష్ట్రంలో కోవిడ్ -19 కేసులు బాగా పెరిగిన నేపథ్యంలో ఈ ఉత్తర్వు వచ్చింది. శనివారం రాష్ట్రంలో 49,447 తాజా కేసులు, 277 మరణాలు నమోదయ్యాయి. COVID-19 కేసుల పెరుగుదలను పరిమితం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశం మీద చర్చించడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఆదివారం రాష్ట్రానికి చెందిన బిజినెస్ మ్యాన్ బృందాన్ని కలిశారు.

ఈ క్ర‌మంలో ప‌లు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకున్నారు.

  • ఐదుగురుకంటే ఎక్కువ మంది స‌మూహాలుగా ఏర్ప‌డే అవ‌కాశం లేదు.
  • ప్ర‌భుత్వ కార్యాల‌యాలు కేవ‌లం 50 శాతం సిబ్బందితోనే ప‌నిచేస్తాయి.
  • ప్ర‌యివేటు ఉద్యోగులు ఇంటినుండే ప‌నిచేయాలి.
  • బ‌స్సులు, రైళ్లు కూడా 50 శాతం సామ‌ర్థ్యంతోనే న‌డ‌వ‌నున్నాయి.
  • త్వ‌ర‌లోనే ఈ ఆంక్ష‌లకు సంబంధ‌ఙంచిన పూర్తి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేస్తామ‌ని స‌ర్కార్ ప్ర‌క‌టించింది.
Leave A Reply

Your email address will not be published.