ఎపిలో ఏడు వేలు దాటినా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజుకు వేయికి పైగా పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 35,907 సాంపిల్స్ ని పరీక్షించగా 7,224 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 955455 కు చేరుకొంది. గడిచిన 24 గంటల్లో కొవిడ్ కారణంగా 15 మంది మృతిచెందారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 7388 మంది కోవిడ్‌తో మృతిచెందారు.
కొత్తగా 2,332 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారని పేర్కొన్నారు. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 907598 మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 40469 గా ఉన్నాయని అధికారులు బులిటెన్‌లో పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తంగా 1,56,42,070 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో 1,051, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 96 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో వరుసగా రెండో రోజూ వెయ్యికిపైగా కేసులు నమోదు కావడం గమనార్హం.