తెలంగాణలో కొత్త‌గా 5,093 క‌రోనా కేసులు

హైద‌రాబాద్‌: తెలంగాణ‌లో క‌రోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 1,29,637 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌రుప‌గా కొత్త‌గా 5,093 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ ఆదివారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,51,424కి చేరింది. రాష్ట్రంలో కొత్తగా 15 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1824కి చేరింది. క‌రోనా బారి నుంచి నిన్న 1,555 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య‌ 3,12,563 కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 37,037 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

తెలంగాణ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 743 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి-488, రంగారెడ్డి-407, నిజామాబాద్-367, వరంగల్ అర్బన్-175, వికారాబాద్-122, సిద్దిపేట్-117, సంగారెడ్డి్-232, రాజన్న సిరిసిల్ల-106, నిర్మల్- 139, నల్లగొండ-139, నాగర్‌కర్నూల్-101, మెదక్-101, మంచిర్యాల-124, మహబూబ్‌నగర్-168, ఖమ్మం-155, కరీంనగర్-149, కామారెడ్డి-232, జగిత్యాల-223 చొప్పున ఈ జిల్లాల్లో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.