రైలు కిందపడి కోవిడ్ రోగి సూసైడ్

అంత్యక్రియలు నిర్వ‌హించిన యువ‌కులు

తాండూరు (clic2news): క‌రోనా సోకింద‌ని మ‌న‌స్తాపం చెందిన ఓ యువ‌కుడు రైలు కింద‌ప‌డి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. అంత్య‌క్రియ‌లు చేసేందుకు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో ముస్లిం యువ‌కులు ఆ క్ర‌తువు పూర్తి చేసి మాన్వ‌త్వాన్ని చాటారు.
వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణానికి చెందిన 31 యేళ్ల యువ‌కుడికి భార్య, ఎండేళ్ల పాప ఉన్నారు. ఇత‌నికి కొవిడ్ పాజిటివ్ తేల‌డంతో ఐదు రోజులుగా హోం క్వారంటైన్ లో ఉంటున్నాడు. ఈ క్ర‌మంలో తీవ్ర మ‌స్తామ‌పంతో ఆ యువకుడు తాండూరు పట్టణంలోని ఫ్లై ఓవర్ కింద రైలు పట్టాలపైపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు శవాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ శవాన్ని తీసుకొని అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాలేదు.
ఈ విషయం తెలుసుకున్న తాండూరు పట్టణ ముస్లిం వెల్ఫేర్ యూత్ సభ్యులు అస్ఘ‌ర్ హుస్సేన్‌, స‌య్య‌ద్ సాఫీక్ మీర్‌, న‌జీర్ మృతుని భార్య అనుమ‌తితో హిందూ సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు జరిపించారు. కోవిడ్ రోగికి అంత్యక్రియలు జరిపించిన తాండూర్ యూత్ సభ్యులను పలువురు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.