ఈజిప్టు: పట్టాలు తప్పిన రైలు.. 11 మంది మృతి
కైరో: ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈజిప్టులో రాజధాని కైరోకు ఉత్తరాన ఉన్న బన్హాలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పిన ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. వంద మందికిపైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను దవాఖానకు తరలిస్తున్నారు. ప్యాసింజర్ రైలు కైరో నుంచి మన్సౌరాకు వెళ్తుండగా టోక్ అనే ప్రాంతంలో ప్రమాదామానికి గురైనట్టుగా అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు పట్టాలు తప్పయి. బోగీల్లో చిక్కకున్నవారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.. అయితే, ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టినప్పుడు ఉన్నతాధికారులు ప్రకటించారు.