TS: రాత్రి కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోండి..
తెలంగాణ సర్కార్‌ను ఆదేశించిన హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్‌పై 48 గంటల్లో నిర్ణయం తోసుకోవాలని రాష్ట్ర హైకోర్టు సోమవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్కార్ నిర్ణయం తీసుకోకపోతే తగిన ఆదేశాలిస్తామని హెచ్చరించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఇవాళ విచారణ జరిగింది. కరోనా నియంత్రణలో సర్కార్ తీరుపై అత్యన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ఈ విచారణ సంధర్భంగా 48 గంటల్లో లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని టీఎస్ హైకోర్టు ఆదేశించింది. లేదంటే తామే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని చీఫ్ జస్టీస్ పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో నమోదైన కేసులు వార్డుల వారీగా కోర్టుకు సమర్పించాలని పేర్కొన్న హైకోర్టు ఆర్ టి పి సి ఆర్ రిపోర్టు 24 గంటల్లో వచ్చేలా చూడాలి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దవఖానల్లో సలహాలు ఇవ్వడానికి నోడల్ అధికారి ని ఎవరినైనా నియమించాలని హైకోర్టు ఆదేశించింది.
Health.telangana.gov.in వెబ్ సైట్ లో కోవిడ్ వివరాలు నమోదు చేయాలన్న హైకోర్టు పెళ్లిళ్లు, శుభకార్యాలలో, పబ్లిక్ ప్లేస్ లలో ఎక్కువ మంది హాజరైతే వారి పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. డీజీపీ, ఆరోగ్య శాఖ అధికారులు ఇచ్చిన నివేదిక సరిగా లేదని మరోసారి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పూర్తి నివేదిక ఈనెల 22లోగా అన్ని వివరాలతో సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
మూడు రోజులు సరిపోవని మరింత సమయం కావలని ఏజీ కోరగా, `మూడు రోజుల్లో మీరు చేయగలిగింది చేయండి.. మిగతాది మేము చేస్తాం“ అని తదుపరి విచారణను ఈ నెల 23 కు వాయిదా వేసింది.
(తప్పక చదవండి:పబ్‌లు, మద్యం దుకాణాలే ముఖ్యమా?)