యశోద ఆస్పత్రికి సిఎం కెసిఆర్
సిఎం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు: డాక్టర్ ఎంవి రావు

హైదరాబాద్: కరోనా వైరస్‌తో బాధపడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన సిటీ స్కాన్‌తోపాటు మరిన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోనున్నారు. వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్ తిరిగి ఫామ్‌హౌస్‌కి వెళ్లనున్నారు.
ఈ నెల 19న సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు సీఎం కేసీఆర్ ఆరోగ్యం పూర్తి స్థాయిలో నిలకడగా ఉందని తెలుస్తోంది. లక్షణాలు సైతం సాధారణంగానే ఉన్నాయని చెబుతున్నారు. కరోన పాజిటివ్ వచ్చిన నాటి నుండి వైద్యుల సలహా మేరకు ఆయన ఫాం హౌస్ లోనే హోం ఐసొలేషన్‌లో ఉన్నారు.
కేసీఆర్ వస్తుండటంతో సోమాజిగూడ ఆస్పత్రి వద్ద భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఆసుపత్రి చుట్టు పక్కల హై అలర్ట్ ప్రకటించారు. కరోనా పాజిటివ్ అనంతరం కేసీఆర్ మొదటిసారి ఆసుపత్రికి వచ్చారు. ఇక కేసీఆర్ ఆస్పత్రికి వస్తుండటంతో కేటీఆర్ ముందుగానే అక్కడకు చేరుకున్నారు.
సిఎం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు: డాక్టర్ ఎంవి రావు
“ముఖ్యమంత్రి కెసిఆర్ కు సాధారణ పరీక్షలు నిర్వహించాం. సిటీ స్కానింగ్ చేశాం. అంతా సాధారణంగానే ఉంది. ఆయనకు కొవిడ్ లక్షణాలు పోయాయి. కెసిఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. త్వరలోనే విధులకు హాజరయ్యే అవకాశం ఉంది. ఆక్సిజన్ లెవెల్స్ బాగానే ఉన్నాయి“ అని సిఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవి రావు తెలిపారు.
యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం సిఎం కెసిఆర్ నేరుగా వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరి వెళ్లారు.