Corona: Apలో 11,698 కేసులు.. 37 మ‌ర‌ణాలు

అమ‌రావ‌తి (CLiC2NEWS): దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా సెకండ్‌ వేవ్ క‌ల్లోల‌మే సృష్టిస్తోంది. రోజురోజుకు కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో 50,972 శాంపిల్స్ పరీక్షించగా 11,698 మందికి కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. ఈ మేర‌కు ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ శనివారం సాయంత్రం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌ల‌పి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1020926కు పెరిగింది. కొత్త‌గా క‌రోనా బారి నుండి 4,421 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 931839 క‌రోనా నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 81471గా ఉన్నాయి.

24 గంట‌ల్లోనే కోవిడ్‌తో 37 మంది మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది. కోవిడ్ బారిన‌ ప‌డి కోవిడ్ వల్ల తూర్పు గోదావరి లో ఆరుగురు, నెల్లూరు లో ఆరుగురు, అనంతపూర్ లో నలుగురు, చిత్తూర్ లో నలుగురు, శ్రీకాకుళం లో ముగ్గురు, పశ్చిమ గోదావరి లో ముగ్గురు, గుంటూరు లో ఇద్దరు, కృష్ణ లో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, విశాఖపట్నం లో ఇద్దరు, విజయనగరం లో ఇద్దరు మరియు ప్రకాశం లో ఒక్కరు చొప్పున మరణించారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 7616 మంది ప్రాణాలు కోల్పోయారు.

Leave A Reply

Your email address will not be published.