Telangana Corona: 24 గంటల్లో 43 మంది మృతి

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 73,275 కరోనా టెస్టులు నిర్వహించగా 6,551 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు సోమవారం ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. ఇవాళ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో రోజువారీ కేసులు కాస్త తగ్గాయి. కానీ మరణాలు పెరిగాయి. కాగా తాజాకేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,01,783కు పెరిగింది. రాష్ట్రంలో వైరస్ ప్రభావంతో 43 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో వైరస్ బారినపడి 2,042 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒకే వైరస్ నుంచి కోలుకొని 3,804 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. కాగా ఇప్పటి వరకు 3,34,144 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 65,597 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది.
కొత్తగా నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో 1,418, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 554, రంగారెడ్డిలో 482, నిజామాబాద్‌లో 388, సంగారెడ్డిలో 368, వరంగల్ అర్బన్‌లో 329, జగిత్యాలలో 276, కరీంనగర్‌లో 222, మహబూబ్‌నగర్‌లో 226, సిద్దిపేటలో 268 అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి.