TS: రేపటి నుంచి పాస్‌పోస్టు సేవలు నిలిపివేత

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న దృష్ట్యా రేపటి నుంచి మే 14 వరకు పాస్‌పోస్టు సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు సర్కార్ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని 14 తపాలా సేవా కేంద్రాల (వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్, ఆదిలాబాద్, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట, మంచిర్యాల, మహబూబాబాద్, కామారెడ్డి, వికారాబాద్, వనపర్తి, మేడ్చల్)ల ద్వారా ప్రభుత్వం పాస్‌పోస్టు సేవలను అందిస్తున్నది. తాజా నిర్ణయంతో గురువారం నుంచి మూతపడనున్నాయి. విషయాన్ని గమనించి దరఖాస్తు దారులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.