రాజస్థాన్ సిఎం గెహ్లాట్‌కు క‌రోనా

జైపూర్ (CLiC2NEWS): రాజ‌స్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. గ‌హ్లాట్ స‌తీమ‌ణి సునిత‌కు బుధ‌వారం వైర‌స్ సోక‌డంతో సిఎం నిన్న‌టి నుంచి ఐసోలేష‌న్లో ఉన్నారు. అనంత‌రం ప‌రీక్ష‌లు చేయించుకోగా.. త‌న‌కు పాజిటివ్ తేలిన‌ట్లు గ‌హ్లాట్ గురువారం ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. త‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ప్ప‌టికీ ఆరోగ్యంగా ఉన్నానంటూ ఆయన వెల్లడించారు. త‌న‌కు ఎలాంటి క‌రోనా లక్ష‌ణాలు లేవ‌ని పేర్కొన్నారు. కోవిడ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం తాను హోం ఐసోలేష‌న్‌లో ఉన్నాన‌ని ట్విట్ చేశారు.

రాజస్థాన్‌లో బుధవారం 16,613 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 120 మంది బాధితులు మరణించారు. ఇప్పటివరకు కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 3,926 మంది మరణించగా.. 5,63,577 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,63,372 యాక్టివ్ కేసులు ఉన్నాయి. క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌జ‌లంతా నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని, లాక్‌డౌన్ ఉన్న‌ట్టే వ్య‌వ‌హ‌రించాల‌ని రాష్ట్ర స‌ర్కార్ ప్ర‌జ‌ల‌ను కోరింది. అంతేకాకుండా ఎప్రిల్ 30 వారకు రాత్రి వేళ క‌ర్ఫ్యూ కూడా విధించింది.

Leave A Reply

Your email address will not be published.