AP Corona: 17,354 కేసులు.. 64 మరణాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 86,494 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 17,354 కరోనా కేసులు నమోదు కాగా 64 మంది చనిపోయారు.. ఈ మేరకు గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,01,690 కు చేరింది.
ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా తో 7992 మంది మృతి చెందారు. ఇక రాష్ట్రంలో 9,70,718 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,22,980 యాక్టివ్ కేసు లు ఉన్నాయి.
తాజాగా నెల్లూరు జిల్లాలో 8 మంది, విశాఖలో 8, విజయనగరంలో 7, చిత్తూరులో 6, తూర్పు గోదావరిలో 6, ప్రకాశంలో 6, అనంతపురంలో 5, గుంటూరులో 4, కర్నూలులో 4, పశ్చిమగోదావరిలో 4, కృష్ణాలో 3, శ్రీకాకుళంలో 3 చొప్పున కరోనాతో మరణించారు.