Sputnik V: హైద‌రాబాద్ చేరుకున్న ర‌ష్యా వ్యాక్సిన్లు

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): భార‌త్‌లో మ‌రో వ్యాక్సిన్ త్వ‌ర‌లో అందుబాటులోకి రానుంది. ర‌ష్యా అభివృద్ధి చేసిన సు్ప‌త్నిక్‌-వి టీకాలు మాస్కో నుంచి ప్ర‌త్యేక విమానంలో నేడు హైద‌రాబాద్ చేరుకున్నాయి. మాస్కో నుంచి ల‌క్షా 50 వేల డోసుల స్పుత్నిక్ వి వ్యాక్సిన్ల‌తో ఉన్న విమానం నేరుగా హైద‌రాబాద్ చేరుకుంది. మ‌రికొద్ది రోజుల్లోనే మ‌రో 30 ల‌క్ష‌ల డోసుల వ్యాక్సిన్ కూడా ఇండియాకు రానుంది. జూన్‌లో ఐదు మిలియ‌న్లు, జూలైలో మ‌రో 10 మిలియ‌న్ల డోసులు ఇండియాకు రానున్న‌ట్లు దౌత్య వ‌ర్గాలు ఇటీవ‌ల వెల్ల‌డించాయి.

ఈ వ్యాక్సిన్ల‌ను డాక్ట‌ర్ రెడ్డీస్ లేబొరేట‌రీస్‌కు డెలివ‌ర్ చేయ‌నున్నారు. ఇండియాలో ఈ వ్యాక్సిన్ త‌యారీకి ర‌ష్య‌న్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్‌)తో చేతులు క‌లిపింది రెడ్డీస్ లేబొరేట‌రీస్‌. గ‌త నెల 13న స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే.

 

Leave A Reply

Your email address will not be published.