kuwait Coroan: టీకా తీసుకోని పౌరులపై ఆంక్షలు..

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. ప‌లు దేశాల్లో కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ క్ర‌మంలో ప‌లు దేశాలు క‌రోనా కట్ట‌డికోసం ప‌లు రకాల ఆంక్ష‌లు విధించారు. గల్ఫ్ దేశాల్లో కరోనా మహమ్మారి మళ్ళీ క్రమంగా విజృంభిస్తోంది.  దీంతో అక్కడ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇండియా విమానాలపై రెండు వారాలు బ్యాన్ విధించింది. అలాగే దేశీయ పౌరులపై కూడా ఆ దేశంలో కఠిన ఆంక్షలు విధించింది.  దేశీయంగా టీకాలు వేయించుకొని పౌరులపై ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. టీకాలు వేసుకోని పౌరులకు విదేశాలకు వెళ్లే అవకాశం ఇవ్వ‌మ‌ని పేర్కొంది. దేశంలోని ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని స్పష్టం చేసింది.  దేశంలో కొత్త‌గా విడుద‌ల చేసిన ఆంక్ష‌లు మే 22 నుంచి అమలులోకి వ‌స్తాయ‌ని అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.