TS Corona : కొత్తగా 6,361 కరోనా కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణ‌లో క‌రోనా సెకండ్‌వేవ్ ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,361 పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు బుధ‌వారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,69,722కు చేరింది. కొత్తగా మహమ్మారి నుంచి 8,126 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారని ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇప్పటి వరకు 3,09,491 మంది కోలుకున్నారు.

తాజాగా వైరస్‌ బారినపడి మరో 51 మంది మరణించారు. ఇప్ప‌టి వ‌ర‌కుక‌రోనా బారిన ప‌డి 2,527 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,704 యాక్టివ్‌ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది.

తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,225, మేడ్చల్‌ జిల్లాలో 422, రంగారెడ్డి జిల్లాలో 423 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.