AP Corona: మ‌ళ్లీ పెరిగిన కేసులు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా సెకండ్‌ వేవ్ విజృంభిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో 1,16,367 న‌మూనాలు పరీక్షించగా 22,204 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యింది. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ బుధ‌వారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.
తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12,06,232 కి చేరింది. 24 గంట‌ల్లోనే కోవిడ్‌తో 85 మంది మృతి చెందారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 8,374 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త‌గా రాష్ట్రంలో 11,128 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 10,27,270 క‌రోనా నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1,70,588 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

గ‌డిచిన 24 గంట‌ల్లో తూర్పు గోదావ‌రి జిల్లాలో అత్య‌ధికంగా 2,344 మంది క‌రోనా బారిన ప‌డ్డారు.

ఇక మ‌ర‌ణాలను ప‌రిశీలిస్తే..

  1. విశాఖ -11
  2. విజ‌య‌న‌గ‌రం- 11
  3. అనంత‌పురుం -10
  4. తూర్పుగోదావ‌రి -9
  5. ప్ర‌కాశం -8
  6. ప‌శ్చిమ‌గోదావ‌రి -7
  7. చిత్తూరు -6
  8. గుంటూరు -5
  9. క‌ర్నూలు-5
  10. నెల్లూరు -5
  11. కృష్ణా -4
  12. శ్రీ‌కాకుళం -3
  13. క‌డ‌ప -1 మ‌తి చెందారు.
Leave A Reply

Your email address will not be published.