ఏపీలో కొత్తగా 10,825 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా జోరు కొన‌సాగుతోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. తాజాగా.. ఏపీలో కొత్తగా 10,825 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 71 మంది మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 69,326 నమూనాలు పరీక్షించగా 10,825 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,87,331కు చేరింది. కొత్తగా 71 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 4,347కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 11,941మంది కోవిడ్‌ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తంగా 3,82,104 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు 40,35,317మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,01,210 యాక్టివ్‌ కేసులు ఉన్నాయ‌ని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

 

Leave A Reply

Your email address will not be published.