TS Coroana: కొత్తగా 6,026 కరోనా కేసులు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 6,026 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం కరోనా బులిటెన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,75,748కి చేరింది.
తాజాగా రాష్ట్రంలో 52 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో చనిపోయినవారి వారి సంఖ్య 2,579కి చేరింది.
తాజాగా వైరస్ నుంచి 6,551 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,127 క్రియాశీల కేసులున్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,115, మేడ్చల్ మల్కాజ్గిరిలో 418, రంగారెడ్డి జిల్లాలో 403 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది.