CM Stalin: క‌రోనా సాయం ఫైలుపై తొలి సంతకం..

చెన్నై(CLiC2NEWS): త‌మిళ‌నాడులో డీఎంకే అధ్య‌క్షుడు ఎంకే స్టాలిన్ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ మేర‌కు చెన్నైలోని త‌మిళ‌నాడు సెక్రెటేరియ‌ట్‌కు వెళ్లిన ఆయన సీఎం కుర్చీలో ఆసీనులై బాధ్య‌త‌ల స్వీకార ప‌త్రంపై సంత‌కం చేశారు. అంత‌కుముందు ఆయ‌న రాజ్‌భ‌వ‌న్‌లో త‌మిళ‌నాడు నూత‌న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేశారు. అనంత‌రం ఆయ‌న త‌న తండ్రి క‌రుణానిధి స్మృతి వ‌నం ద‌గ్గ‌రికి వెళ్లి నివాళుల‌ర్పించారు. అక్క‌డి నుంచి నేరుగా సెక్రెటేరియ‌ట్‌కు వ‌చ్చి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

తొలి రోజు కీల‌క ఉత్త‌ర్వుల‌పై స్టాలిన్ సంత‌కాలు చేశారు.
  • ప్ర‌భుత్వ బ‌స్స‌ల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం
  • కొవిడ్ ఆర్ధిక సాయం: రేష‌న్ కార్డు ఉన్న 2.07 కోట్ల కుటుంబాల‌కు రూ. 4 వేలు చొప్పున సాయం. మొద‌టి విడ‌త కింద రూ. 2 వేల చొప్పున జ‌మ‌.
  • రాష్ట్రంలో లీట‌ర్ పాల‌పై రూ.3 త‌గ్గింపు.

ముఖ్య‌మంత్రి ఎంకె స్టాలిన్ వీటిపై సంత‌కాలు చేసి ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.