ఫ్లైఓవ‌ర్‌పై డివైడ‌ర్‌ను ఢీకొన్న బైకు.. వ్య‌క్తి మృతి

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని టోలిచౌకిలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఒక వ్య‌క్తి మ‌ర‌ణించాడు. ఆదివారం అర్ధ‌రాత్రి టోలిచౌకి ఫ్లైఓవ‌ర్‌పై అతివేగంగా దూసుకొచ్చిన బైకు అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. ఈ ఫ్ర‌మాదంలో ద్విచ‌క్ర వాహ‌నంపై వెళ్తున్న న‌వాజ్ అనే వ్య‌క్తి ఘ‌ట‌నా స్థ‌లంలోనే మ‌ర‌ణించాడు. మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌పడ్డారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని క్ష‌త‌గాత్రుడిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మృతిచెందిన న‌వాజ్ మంగ‌ళ్‌హాట్ చెందిన‌వాడిగా, గాయ‌ప‌డిన వ్య‌క్తి నాంప‌ల్లిలోని ముర్గి మార్కెట్‌కు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.