India Corona: స్వల్పంగా తగ్గిన కేసులు..
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసులు నిన్నటి కంటే స్వల్పంగా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 3,29,942 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర వైద్యారోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,29,92,517కి చేరింది. ఇందులో 1,90,27,304 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 37,15,221 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనాతో 3,876 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి దేశంలో ఇప్పటివరకు కరోనాతో 2,49,992 మంది మృతి చెందారు. ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 3,56,082 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు.