Mnacherial: జిల్లాలో కల్తీ మద్యం దందా..

టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు

మంచిర్యాల (CLiC2NEWS):  జిల్లాలోని వైన్ షాపులపై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో గల లక్ష్మీగణపతి వైన్స్ లో రూ. 60 వేల రూపాయల కల్తీ మద్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇందారంలోని వైన్ షాప్ లో కల్తీ మద్యం తయారు చేసి సింగరేణి ఏరియాలో అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

శ్రీరాంపూర్ పట్టణంలోని ఆర్కే 8 కాలనీలో సురేష్ అనే వ్యక్తి ఇంట్లో సుమారు రూ 78 వేల రూపాయల కల్తీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి సంయుక్తంగా రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు.

కాగా ఇప్ప‌టికే జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గం కన్నెపల్లి మండల కేంద్రంలో బెల్ట్ షాప్ లపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు ప‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. సుమారు 38 వేల రూపాయల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.