కరోనాపై భయాలువద్దు.. లాక్ డౌన్‌ వల్ల తీవ్రత తగ్గుతుంది: పుట్ట మధుకర్

మంథ‌ని(CLiC2NEWS): కరోనా పై ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం పూర్తిగా ప్రమత్తంగా ఉందని, వైరస్ ను ఎదుర్కొనేందుకు చికిత్స కన్నా ధైర్యమే మందు అని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు..

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్ రాగానే ఏదో ప్రమాదం జరిగిపోయిందనే భయాందోళనలకు గురవుతున్నారని, పాజిటివ్ వచ్చినా 99 శాతం మందిలో కరోనా నుంచి కోలుకునే వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది అన్నారు.. కానీ భయానికి గురై, మానసికంగా నిరంతరం ఆలోచించడం వల్లే చాలామంది తీవ్ర అస్వస్థతకు గురై, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు..

జిల్లాలో మందులు, పడకల కొరత ఏమాత్రం లేదని ఆయన వివరించారు. జిల్లా వ్యాప్తంగా 100 ఆక్సిజన్ బెడ్లు, మరో 100 వెంటిలేటర్ బెడ్ లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని, పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రిలో మరో 50 ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేస్తున్నామన్నారు..

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, కనీస అవసరాలను తీర్చుకునేందుకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వెసులుబాటు కల్పించారని తెలిపారు. ప్రజలు లాక్ డౌన్ కు పూర్తిగా సహకరించాలని కోరారు. రాష్ట్రంలోని పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారని అని వివరించారు..
ప్రతిరోజు కరోనా కేసులు ఒకవైపు వస్తుంటే మరో వైపు అంతకంటే ఎక్కువగా వైరస్ నుంచి కోలుకుని డిస్ ఛార్జ్ సైతం జరుగుతున్నారని, ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, వైద్య ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉన్నదని తెలిపారు. కరోనా కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా సేవాలందిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు, పంచాయితీరాజ్, మున్సిపల్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, మీడియా సోదరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.