AP: MP రఘురామకృష్ణరాజు అరెస్టు

హైదరాబాద్ : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును శుక్రవారం హైదరాబాద్ లో ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై 124(A),153(B),505 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేసి ఎంపీ రఘురామ ప్రభుత్వ ప్రతిష్ఠ కు భంగం కలిగించారని సీఐడీ అబియోగం మోపింది. కుటుంబ సభ్యులకు నోటీసులు జారీచేసింది.