Sputnik V: హైదరాబాద్‌కు చేరిన వ్యాక్సిన్లు

హైద‌రాబాద్ (CLiC2NEWS): రష్యాకు చెందిన స్పుత్నిక్‌ వీ క‌రోనా వ్యాక్సిన్లు ఆదివారం భార‌త్‌కు చేరుకున్నాయి. రెండొ విడ‌త కింద 60 వేల టీకా డోసులు ప్రత్యేక విమానంలో హైద‌రాబాద్‌లోని శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. అక్కడికి నుంచి వాటిని నేరుగా రెడ్డీస్‌ ల్యాబ్‌కు తరలించారు. 67లక్షల డోసులు కావాలని కంపెనీ ఆర్‌డీఐఎఫ్‌ను కోరగా.. రష్యా వాటిని విడుదల వారీగా పంపిస్తోంది. ఇప్ప‌టికే తొలి విడ‌త కింద 1.50 ల‌క్ష‌ల డోసులు మే 1న భార‌త్‌కు చేరిన విష‌యం తెలిసిందే.

సోమవారం నుంచి దేశంలో టీకా పంపిణీ ప్రారంభం కానుంది. జూన్‌ నుంచి దేశంలోనే స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయనున్నట్లు రెడ్డీస్‌ ల్యాబ్‌ ఇప్పటికే ప్రకటించింది. టీకాను రష్యాకు చెందిన గమలేయ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎపిడెమాలజీ అండ్‌ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసింది.

ఒక్కో డోస్ ధర రూ.995గా నిర్ణయించింది. టీకా వాస్తవ ధర రూ.948 కాగా.. దీనికి జీఎస్టీ అదనమని తెలిపింది. టీకా 91.6 శాతం ప్రభావంతం పని చేస్తుందని ఆర్‌డీఐఎఫ్‌ తెలిపింది. దీన్ని రెండు నుంచి ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య నిల్వ చేసే అవకాశం ఉంది. రెండు డోసుల వ్యాక్సిన్‌ కాగా, మొదటి డోసు ఇచ్చిన 21వ రోజున రెండో డోసు ఇవ్వనుండగా.. 28 నుంచి 42 రోజుల మధ్యలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుందని ఆర్‌డీఐఎఫ్‌ పేర్కొంది.

కాగా టీకాల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని `డాక్ట‌ర్ రె్డీస్‌` చేప‌ట్టింది. డాక్ట‌ర్ రెడ్డీస్‌లో క‌స్ట‌మ్ ఫార్మా స‌ర్వీసెస్ వ్యాప‌ర విభాగానికి అధిప‌తిగా ఉన్న దీపక్ స‌ప్రా తొలి `స్పుత్నిక్ వి` డోసు తీసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.