20వ తేదీ వరకు రేషన్ బియ్యం పంపిణీ
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 20 వరకు రేషన్ బియ్యం పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ప్రతి నెల 1వ తేదీన ప్రారంభమై 15వ తేదీవరకు బియ్యం పంపిణీ జరుగుతుంది. అయితే ఈ నెల కొన్ని కారణాలతో పంపిణీ మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభమయ్యింది. ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో ఈ నెల 18 వరకు, మరికొన్ని జిల్లాల్లో 20 వరకు బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది.