వారెవ్వా.. శునకం యోగాసనాలు!

కాన్బెర్రా: విశ్వాసానికి మారుపేరు శునకం.. విశ్వాసం చూపడంలో ఇది ఎప్పుడూ ముందు ఉంటుంది. అందుకే శునకాలు, మనుషుల మధ్య సంబంధం ప్రత్యేకంగా ఉంటుంది. అయితే తాజాగా ఓ పెంపుడు కుక్క యోగాసనాల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆస్ట్రేలియాలో గొర్రెలకు కాపలా ఉండే ఆ శుకనం పేరు సీక్రెట్. ఈ శునకం చాపపై యోగా చేస్తూ.. దాని యజమాని మేరీని అనుకరిస్తుంది.
ఈ వీడియోను `మై ఆసి గాల్` అనే క్యాప్సన్తో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోను మాజీ అమెరికన్ ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ `ఈ కుక్క వాస్తవానికి యోగా చేస్తోంది.` అనే క్యాప్సన్తో ట్విట్టలో షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 4 మిలియన్ల నెటిజన్లు వీక్షించారు.
This dog is actually doing yoga… pic.twitter.com/d7oK5EJa2l
— Rex Chapman🏇🏼 (@RexChapman) May 17, 2021