ముల్లంగి తిన‌డం వ‌ల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

ముల్లంగిని ప్రపంచవ్యాప్తంగా పండించి వినియోగిస్తారు. వీటిని ఎక్కువగా పచ్చిగా తింటారు. అనేక రకాలు ఉన్నాయి. వాటి పరిమాణం, రుచి, రంగు, పరిపక్వతకు సమయాలలో వైవిధ్యం ఉంటుంది. ముల్లంగి మొక్కలు ఉత్పత్తి చేసే వివిధ రసాయన సమ్మేళనాలలో వాటి పదునైన రుచితో గ్లూకోసినోలేటు, మైరోసినేసు, ఐసోథియోసైనేట్లు ఉంటాయి. ఇవి కొన్నిసార్లు తోడు మొక్కలుగా పెరుగుతాయి. ఇవి కొన్ని తెగుళ్ళు, వ్యాధులతో బాధపడుతాయి. ఇవి త్వరగా మొలకెత్తి, వేగంగా పెరుగుతాయి. సాధారణ చిన్న రకాలు ఒక నెలలోనే వినియోగానికి సిద్ధంగా ఉన్నాయి.

ముల్లంగి దీని పేరు విన‌గానే చాలామందికి ఇది న‌చ్చ‌దు. ఎందుకంటే దీని వాస‌న అంద‌రికీ న‌చ్చ‌క‌‌పోవ‌డం. స‌రైన ఆవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల‌న ముల్లంగిని ఆహారంగా ఉప‌యోగించ‌రు. కానీ దీనిలో మేలు చేసే ఔషధ గుణాలెన్నో ఉన్నాయి. దీని విలువ తెలిసిన వారు మాత్రం త‌ర‌చూ ఆహారంగా ఉప‌యోగిస్తారు. ముల్లంగిని మ‌నం రోజువారీ ఆహారంలో వినియోగిస్తే మ‌నం ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు.

ముల్లంగి జీవక్రియ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది, తలనొప్పి మరియు ఎసిడిటిని ద‌రిచేర‌నీయ‌దు. గొంతునొప్పిని నివారిస్తుంది. ఇది ఆకలిని కూడా పెంచుతుంది. అలాగే నోటిశ్వాసను తాజాగా ఉంచుతుంది. రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది.

ముల్లంగి వల్ల కలిగే ప్రయోజనాలు:

  • జ్వరం: జ్వరానికి కారణమయ్యే లక్షణాలతో పోరాడి, జ్వరాన్ని తగ్గిస్తుంది. ముల్లంగి రసంలో కొద్దిగా ఉప్పు కలిపి తాగడం వల్ల శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ను క్ర‌మంగా త‌గ్గిస్తుంది.
  • కిడ్నీ: ముల్లంగి మూత్రపిండాలకు సంబంధించిన‌ వ్యాధులను నియంత్రించి మూత్రపిండాలు సక్రమంగా పనిచేసేందుకు సహాయపడతాయి. మన శరీరంలోని చెడు పదార్థాలను తొలగించడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.
  • కామెర్లు (జాండిస్): ముల్లంగి ఆకులు కూడా ఔషధంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. కామెర్ల నివారణకు దీని ఆకుల‌ను ఉపయోగిస్తారు.
  • మొలలు: ముల్లంగికి శరీరంలోని చెడు పదార్థాలను బయటకు పంపే గుణాలు ఎక్కువగా ఉంటాయి. మొలల వ్వాధి నివారణకు బాగా సహాయపడుతుంది.
  • మూత్ర సంబంధిత వ్యాధులు: శరీరంలో ఏర్పడే మలినాలను తొలగించడానికి, మూత్రవిసర్జన సమయంలో ఏర్పడే మంటను నివారించడానికి ఉపయోగపడుతుంది. ముల్లంగిని తరచూ తీసుకోవడం వల్ల కిడ్నీలు, యూరినరీ సిస్టమ్‌ ఇన్ఫెక్షన్‌ బారిన పడకుండా కాపాడుతుంది.
  • క్యాన్సర్‌: ముల్లంగిని రోజూ తీసుకోవడం వలన కాన్స‌ర్ బారిన ప‌డ‌కుండా ర‌క్షించుకోవ‌చ్చు. కోలన్‌ క్యాన్సర్‌, జీర్ణాశయ క్యాన్సర్‌, కిడ్నీ కాన్సర్‌, ఓరల్‌ క్యాన్సర్‌ను రాకుండా కాపాడుతుంది.
Leave A Reply

Your email address will not be published.