TS Corona: కొత్తగా 3,837 కరోనా కేసులు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,837 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 5,40,603కు చేరింది.
గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 25 మంది చనిపోయారు. అలాగే 4,976 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ర్టంలో ప్రస్తుతం 46,946 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇవాళ 71,070 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 594 పాజిటివ్ కేసులు, రంగారెడ్డిలో 265, మేడ్చల్ జిల్లాలో 239 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.