ఆక్సిజన్‌ బ్యాంకుల ఏర్పాటుకు చిరంజీవి నిర్ణయం

హైద‌రాబాద్: క‌రోనా బాధితుల‌కు అండ‌గా ఉండేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చారు. ఆక్సిజ‌న్ కొర‌త దృష్ట్యా చిరంజీవి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అవసరమైన వారికి తన బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌ ద్వారా ఆదుకుంటున్న చిరు ఇప్పుడు ఆక్సిజన్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో చిరు ఆక్సిజన్‌ బ్యాంకును త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. తాజాగా ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ ఆక్సిజ‌న్ బ్యాంకులు వారం రోజుల్లోనే అందుబాటులోకి రానున్నాయి. ఆక్సిజ‌న్ ట్యాంకుల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను అభిమాన సంఘాల జిల్లా అధ్య‌క్షుల‌కు అప్ప‌గించ‌నున్నారు.

`సమయానికి రక్తం దొరక్క ఎవరూ మరణించకూడదనే సంకల్పంతో 1998లో చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ప్రారంభించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమయానికి ఆక్సిజన్‌ అందక ఎవరూ మరణించకూడదనే సంకల్పంతో చిరు ఆక్సిజన్‌ బ్యాంకు ప్రతి జిల్లాలోనూ నెలకొల్పాలని నిర్ణయించారు. వచ్చే వారం రోజుల్లో ప్రజలకి ఆక్సిజన్‌ బ్యాంకు అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాట్ల చేస్తున్నారు` అని చిరంజీవి ఆఫీస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.

Leave A Reply

Your email address will not be published.