అమెరికాలో మళ్లీ కాల్పులు.. 8 మంది మృతి

వాషింగ్టన్‌ : అమెరికాలో ఓ దుండగుడు జ‌రిపిన కాల్పుల్లో 8 మంది చెందారు. ఈ ఘ‌ట‌న‌లో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన కాలిఫోర్నియాలోని శాన్‌జోన్‌లోని పబ్లిక్ ట్రాన్సిట్‌ మెయింటెనెన్స్ యార్డ్‌లో ఘటన జరిగింది. ఘటనలో నిందితుడు సైతం మరణించాడని అమెరికా పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది ఉద్యోగులు చనిపోయారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. నిందితుడిని వ్యాలీ ట్రాన్స్‌ఫోర్ట్‌ అథారిటీ ఉద్యోగి 57 ఏళ్ల సామ్‌ కాసిడీగా గుర్తించారు. అయితే, కాల్పులకు గల కారణాలు తెలియరాలేదని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.