TS: స్వగ్రామాన్ని సందర్శించిన అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్

సిద్దిపేట (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్ ఆయన స్వగ్రామమైన పాత దొమ్మాటను సందర్శించారు. ఏజీ వెంట జిల్లా కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్ తదితరులు ఉన్నారు.
కాగా ఎజి పర్యటన సందర్భంగా పాత దొమ్మాట గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. దానికి స్పందించిన ఏజీ మంత్రి హరీశ్ రావుతో మాట్లాడారు. ఎజి కోరిన వెంటనే పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీష్‌రావు ఆమోదం తెలిపారు.