ప‌ర్మిష‌న్ లేని పెంపుడు జంతువుల స్టోర్స్‌ సీజ్?

హైద‌రాబాద్ (CLiC2NEWS): అనుమతులు లేకుండా నిర్వ‌హిస్తున్న పెంపుడు జంతువుల స్టోర్స్‌ దుకాణదారుల‌కు మున్సిప‌ల్ అధికారులు హెచ్చ‌రించారు. అనుమ‌తి గడువు ముగిసిన తర్వాత నిబంధనలను పాటించని దుకాణాలకు సీలు వేయాలని మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్, పశుసంవర్ధకశాఖ‌ డైరెక్టర్ డాక్టర్ వి. లక్ష్మారెడ్డిని ఆదేశించారు. అలాగే అధికారులు తెలిపిన రికార్డుల ప్ర‌కారం జీహెచ్ఎంసీ ప‌రిధిలో 70 దుకాణాలు తెలంగాణ స్టేట్ యానిమ‌ల్ వెల్ఫేర్ బోర్డు రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికేట్ లేకుండా ప‌నిచేస్తున్నాయి. కాగా వీరంతా రిజిస్ట్రేష‌న్ చేసుకునేందుకు వీరికి 4 వారాల గ‌డువు ఇస్తున్న‌ట్లు తెలిపారు. అనుమ‌తులు తీసుకోక‌పోతే ఆయా షాపుల‌ను సీల్ చేయ‌నున్న‌ట్లు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.