TS: నేతన్నకు శుభవార్త.. `నేతన్నకు చేయూత` తిరిగి ప్రారంభం
హైదరాబాద్ (CLiC2NEWS): కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణలోని నేత కార్మికులకు శుభవార్త చెప్పింది. నేతన్నకు చేయూత కార్యక్రమాన్ని రాష్ట్రంలో తిరిగి ప్రారంభిస్తున్నట్లు టెక్స్ టైల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు.
మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. నేత కార్మికుడు జమ చేసుకునే 8% వేతన వాటాకు రెట్టింపు వాటాను ప్రభుత్వం జమ చేస్తుందని పేర్కొన్నారు. దీంతోపాటు మరమగ్గ కార్మికులు చేసే 8 శాతం వేతన వాటాకు సమానంగా మరో 8 శాతం వాటాను ప్రభుత్వం జమచేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
దీంతోపాటు మరమగ్గ కార్మికులు చేసే 8 శాతం వేతన వాటాకు సమానంగా మరో 8 శాతం వాటాను ప్రభుత్వం జమచేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 25 వేల మంది చేనేత కార్మికులకు, మరో 10 వేల మంది పవర్ లూమ్ కార్మికులకు ఈ పొదుపు పథకం భరోసాను ఇస్తుందని మంత్రి అన్నారు.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 14, 2021