Siddipet: MLA క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ (CLiC2NEWS) : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సిద్దిపేట జిల్లాకు చేరుకున్నారు. ఆయనకు హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈరోజు నుండి మూడురోజులు (జూన్ 20,21,22) సీఎం జిల్లాల్లో పర్యటిస్తారన్న విషయం తెలిసినదే. జిల్లాల పర్యటనలో భాగంగా మెదటి రోజు సిద్దిపేట జిల్లాలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి హరీశ్ రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యాలయ నిర్మాణం అత్యాధునిక సదుపాయాలతో ఎకరం విస్తీర్ణంలో రూ.4 కోట్లతో నిర్మించారు. అనంతరం సీఎం పోలీసు కమిషనరేట్ కార్యాలయాన్ని, సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాన్ని ప్రారంభించారు.