వార‌ఫ‌లాలు (జూన్ 20-27)

మేష రాశి
అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

ఈ వారం ప్రముఖ వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ముందుకు సాగి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఉన్నతస్థితి దక్కే అవకాశం. కళారంగం వారికి అవకాశాలు మరింత పెరుగుతాయి. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు. మానసిక అశాంతి. స్నేహితులతో సఖ్యత నెలకొంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి కాగలవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, శుభం కలుగుతుంది.


వృషభ రాశి
రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

ఈ వారం నిరుద్యోగుల యుత్నాలు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలలో నిరాశాజనకంగా ఉంటుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయవర్గాలకు అంచనాలు తప్పుతాయి. వారం మధ్యలో శుభవర్తమానాలు. ధనలబ్ధి. ఆదాయం అంతగా కనిపించదు. కొత్తగా అప్పులు చేస్తారు. కుటుంబసమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. బంధువులతో ఆస్తి వివాదాలు నెలకొంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. శుభం కలుగుతుంది.



మిథున రాశి
మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

ఈ వారం వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. వారం చివరిలో అనుకోని ధనవ్యయం. ఆస్తుల వివాదాలు. విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ఆదాయం పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, శుభం కలుగుతుంది.


కర్కాటక రాశి
పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

ఈ వారం ఉద్యోగ విధుల్లో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. అనారోగ్యం. కొత్త వ్యక్తులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు దక్కుతాయి. కోర్టు వ్యవహారాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. కొన్ని పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, శుభం కలుగుతుంది.


సింహ రాశి
మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-

ఈ వారం వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. ఆస్తి వివాదాలు. ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహనసౌఖ్యం. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, శుభం కలుగుతుంది.


కన్యా రాశి
ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

ఈ వారం ఉద్యోగాలలో సమర్థతను అందరూ ప్రశంసిస్తారు. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజమవుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆదాయం అనుకున్నంతగా పెరుగుతుంది. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలలో పెట్టుబడులతో పాటు లాభాలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, శుభం కలుగుతుంది.


తులా రాశి
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

ఈ వారం వ్యాపారాలలో సమస్యలు తీరి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాల యత్నాలు సఫలం. కళారంగం వారికి అవకాశాలు మరింత పెరుగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. ఆప్తులతో మాటపట్టింపులు. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. అందరిలోనూ ప్రత్యేకతను నిలుపుకుంటారు. భూములు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. కొన్ని సమస్యల నుంచి చాకచక్యంగా బయటపడతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, శుభం కలుగుతుంది.


వృశ్చిక రాశి
విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

ఈ వారం ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. నూతన విద్యావకాశాలు దక్కవచ్చు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిభారం కొంత తగ్గవచ్చు. రాజకీయవర్గాల యత్నాలు అనుకూలిస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆర్థిక లావాదేవీలు మొదట్లో ఇబ్బందిగా ఉన్నా క్రమేపీ అధిగమిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గోమాతకు గ్రాసం పెట్టండి శుభం కలుగుతుంది.


ధనుస్సు రాశి
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

ఈ వారం వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో వివాదాల నుంచి గట్టెక్కుతారు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వైరం. ఆరోగ్యభంగం. కొన్ని సమస్యలను క్రమేపీ పరిష్కరించుకుంటారు. అనుకున్న పనులు కొంత నెమ్మదించినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలులో ఆటంకాలు తొలగుతాయి. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కవచ్చు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. శుభం కలుగుతుంది.


మకర రాశి
ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఈ వారం వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. రుణ బాధలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, శుభం కలుగుతుంది.


కుంభ రాశి
ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ఈ వారం వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. పరపతి మరింత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ప్రోత్సాహం అందుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, శుభం కలుగుతుంది.


మీన రాశి
పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

ఈ వారం ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. పారిశ్రామికవర్గాలకు వివాదాలు పరిష్కారమవుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. సోదరులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వాహనసౌఖ్యం. నిరుద్యోగులకు ఉద్యోగాన్వేషణలో విజయం. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, శుభం కలుగుతుంది.


-ఎన్‌.రాజ్య‌ల‌క్షి
జ్యోతిష్య‌పండితులు

Leave A Reply

Your email address will not be published.