AP Corona: కొత్తగా 5646 కేసులు

అమరావతి:(CLiC2NEWS): ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 5646 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,50,563 కు చేరింది.
గడిచిన 24 గంటల్లో ఏపీలో 7772 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 17,75,176 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 63,068 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 50 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 12,319 మంది మృతి చెందారు.