Adilabad: భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత

అదిలాబాద్ (CLiC2NEWS): జిల్లా కేంద్రంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని తాటిగూడ కాలనీలో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో రూ.06 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. తాటిగూడ కాలనీకి చెందిన మహమ్మద్ సమీర్ అక్రమంగా చిరు వ్యాపారులకు గుట్కా ప్యాకేట్లను సరఫరా చేస్తున్నాడనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్ సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిపారు. .