AP: కశ్మీర్లో తెలుగు జవాన్ వీరమరణం

గుంటూరు(CLiC2NEWS): జమ్ముకశ్మీర్లో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన జవాన్ మరుపోలు జస్వంత్ రెడ్డి వీరమరణం పొందాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు, ఇద్దరు జవాన్లు మరణించారు. మరణించిన జవాన్లలో ఒకరు గుంటూరు జిల్లాలోని బాపట్ల మండలం దరివాద కొత్తపాలెం గ్రామానికి చెందిన జస్వంత్ రెడ్డి ఒకరు. ఈయన ఐదు సంవత్సరాల క్రితం ఆర్మీలో చేరారు.