దేశంలో 47లక్షలను దాటిన కరోనా కేసులు

కోలుకున్న వారు 37 ల‌క్ష‌ల మంది

న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి అధికంగా ఉంది. రోజుకి సుమారు 95వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో .. మొత్తం కరోనా కేసుల సంఖ్య 47,54,356కి చేరింది. గడిచిన 24 గంటల్లో 94,372 కరోనా కేసులు నమోదవగా, 1,114 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 78,586కి చేరింది. ఇప్పటి వరకు 37,02,595 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం 9,73,175 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా, గడిచిన 24 గంటల్లో 78,399 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే గడిచిన 24 గంటల్లో 10.71 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసిఎంఆర్‌ తెలిపింది. దేశవ్యాప్తంగా 5.62 కోట్లమందికి కరోనా టెస్టులు చేపట్టినట్లు ఐసిఎంఆర్‌ పేర్కొంది. కాగా మ‌ర‌ణాల రేటు 1.65 శాతంగా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే కోవిడ్‌తోమ‌ర‌ణిస్తున్న వారిలో దాదాపు 70శాతానికైగా ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లే కార‌ణ‌మ‌ని ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు 5 కోట్ల 62 ల‌క్ష‌ల శాంపిళ్ల‌కు టెస్టులు పూర్తి చేసిన‌ట్లు అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.