Mancherial: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో

మంచిర్యాల (CLiC2NEWS): మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశం మేరకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మీ టాకీస్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. దీంతో వాహనాల రాకపోకలు భారీగా నిలిచిపోయాయి. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ శాంతియుత ప్రదర్శనను పోలీసులు అడ్డుకొని రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం శోచనీయం అన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం సాగిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అద్యక్షులు అంకం నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి టీపీసీసీ ఎస్సీ సెల్ మహిళ కన్వీనర్, కౌన్సిలర్ మోతే సుజాత, మహిళ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, మున్సిపల్ డిప్యూటి ఫ్లోర్ లీడర్ సంజీవ్, ఉపాధ్యక్షులు వడ్డే రాజమౌళి, కౌన్సిలర్ ప్రకాష్ నాయక్, నాయకులు దాసరి లచ్చన్న, కొండ శేఖర్,నాంపల్లి శ్రీనివాస్, పుదరి ప్రభాకర్, శ్రీరాముల మల్లేష్, బొల్లం భీమయ్య, పెంట రమేష్, కొమురయ్య, శ్రీపతి,దోమల రమేష్, పవన్, తిరుపతి, రాజరావు, సాయి, షకీల్, ఆత్రం శంకర్, సూరం సతీష్, ఖాలిద్ , లక్ష్మణ్, గట్టు స్వామి, బద్రి ప్రకాష్, రాజ్ కుమార్, శైలజ, పల్లవి తదతరులు పాల్గొన్నారు.