లిబియాలో పడవ బోల్తా ప‌డి 57 మంది మృతి

లిబియా (CLiC2NEWS): లిబియాలో శరణార్థులతో వెళ్తున్న ప‌డ‌వ ప్రమాదవశాత్తు బోల్తా ప‌డిన ఘ‌ట‌న‌లో 57 వరకు శరణార్థులు మరణించి ఉంటారని యూఎన్‌ మైగ్రేషన్‌ కు చెందిన ఓ ఉన్నతాధికారి మీడియాకు పేర్కొన్నారు. ఈ పడవ లిబియాలోని ఖుమ్స్‌ నుంచి ఆదివారం బయలు దేరిందని అంతర్జాతీయ వలస దారుల సంస్థ లో ఉన్న కీలకమైన అధికారి సఫా మెహ్లీ అంటున్నారు.

ప్ర‌మాద స‌మ‌యంలో ఆ పడవలో 75 మంది ఉన్నట్లు అల్‌ జబీరా అంచనా వేసింది. ఈ ప్ర‌మాదంలో 57మంది మరణించగా, మిగిలిన 18 మంది శరణార్థులు నీటిలో ఈదుకుంటూ నిన్న రాత్రికి ఒడ్డుకు చేరినట్లు అధికారి సఫా మెహ్లీ స్పష్టం చేశారు. మృతి చెందిన వారిలో నైజీరియా, ఘనా మరియు గాంబియా దేశాలకు చెందిన వారే అధికాంగా ఉన్నట్లు అధికారులు తేల్చేశారు.

Leave A Reply

Your email address will not be published.