భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్న ఇద్దరు ఎస్‌ఐలు వీఆర్‌కు అటాచ్‌!

న‌ల్ల‌గొండ‌ (CLiC2NEWS): జిల్లాలో భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్న ఇద్దరు ఎస్‌ఐలను వీఆర్‌కు అటాచ్‌ చేస్తూ న‌ల్ల‌గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ మంగ‌ళ‌వారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మేర‌కు డిండి ఎస్‌ఐ గా విధులు నిర్వహిస్తున్న శోభన్‌బాబు, పెద్దవూర ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న సైదాబాబు కొంతకాలంగా భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్నట్లు ప‌లు ఆరోపణలున్నాయి.

ఈ ఆరోప‌ణ‌ల‌పై అంతర్గత విచారణ నిర్వహించిన పోలీసు ఉన్నతాధికారులు ఆరోపణలు వాస్త‌మే అని తేల్చారు. దీంతో ఈ మేరకు ఎస్పీ రంగనాథ్‌కు నివేదిక స‌మ‌ర్పించారు. ఈ మేర‌కు ఎస్పీ ఆయన ఈ ఇద్దరు ఎస్‌ఐలను వీఆర్‌కు అటాచ్‌ చేస్తూ ఆదేశాలిచ్చారు. తెలంగాణ పోలీసు శాఖ క్రమశిక్షణకు పెట్టింది పేరని, సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.